Saturday, 25 February 2017

26 ఫిబ్రవరి 2017

కుటుంబ పరిస్థితులు క్రమేణా మెరుగుపడతాయి. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, పానీయ, ఆల్కహాలు వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపరస్తులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం.

Thursday, 23 February 2017

24 ఫిబ్రవరి 2017

ప్రైవేటు సంస్థల్లోని వారికి పని ఒత్తిడి, చికాకులు తప్పవు. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులు, వృత్తుల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు తోటివారు అన్నివిధాలా సహకరిస్తారు. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది.

Wednesday, 22 February 2017

23 ఫిబ్రవరి 2017

లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలచుకుంటారు. ఇతరుల విషయాల్లో అతిగా వ్యవహరించి భంగపాటుకు గురవుతారు. ఆహార వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. మీ సంతానం ఉన్నతి కోసం నూతన ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. ప్రేమికుల మధ్య సఖ్యత నెలకొంటుంది.

Tuesday, 21 February 2017

22 ఫిబ్రవరి 2017

ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. పెండింగ్ పనులు సైతం పూర్తి చేస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు సకాలంలో పూర్తవుతాయి. మీ అంచనాలకు తగినట్లుగా ఆర్థిక పరిస్థితి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ప్రముఖులతో సంప్రదింపులు అలవర్చుకోండి.

Sunday, 19 February 2017

20 ఫిబ్రవరి 2017

ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. ఒక విషయంలో మీ అంచనా ఫలించదు. ఖర్చులు, చెల్లింపుల విషయంలో మెలకువ వహించండి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. కొంతమంది మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.


Saturday, 18 February 2017

19 ఫిబ్రవరి 2017

మీ అలవాట్లు, మాటతీరు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. విద్యార్థులకు ధ్యేయంపట్ల ఏకాగ్రత, కొత్త విషయాలపట్ల ఆసక్తి ఏర్పడతాయి. చేతివృత్తులు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత, చికాకులు తప్పవు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.

Friday, 17 February 2017

18 ఫిబ్రవరి 2017

దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. నిర్మాణపనుల్లో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, ప్రత్యేక ఇంక్రిమెంటు లాంటి శుభ పరిణామాలుంటాయి. నిరుద్యోగ యత్నాలు కలసిరాగలవు. పత్రికారంగంలోని వారికి ఓర్పు ముఖ్యం. ఆహ్వానాలు అందుకుంటారు.

Thursday, 16 February 2017

17 ఫిబ్రవరి 2017

మీ కార్యక్రమాలు సమయానుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. రుణయత్నాల్లో అనుకూలత. షాపింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. రాబడికి మించిన ఖర్చుల వల్ల చేబదుళ్లు తప్పవు. విద్యార్థులు ప్రేమ విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఇంటికి అవసరమైన వస్తుసామగ్రి సమకూర్చుకుంటారు.

Wednesday, 15 February 2017

16 ఫిబ్రవరి 2017

విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ వహించండి. దైవ కార్యాలకు సహాయ సహకారాలను అందిస్తారు. బేకరీ, స్వీట్స్, తినుబండారాల వ్యాపారులకు, తయారీదారులకు ఒత్తిడి పెరుగుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. అవివాహితులు శుభవార్తలు వింటారు.

Tuesday, 14 February 2017

15 ఫిబ్రవరి 2017

ట్రాన్స్‌ఫోర్టు, ఎక్స్‌ఫోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. వృత్తుల వారికి సదవకాశాలు లభించినా ఆశించినంత సంతృప్తి ఉండదు. పెద్దల ఆరోగ్యం విషయంలో మెలకువ అవసరం. ఉద్యోగస్తుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. వస్త్ర, బంగారం వ్యాపారులకు పురోభివృద్ధి.

Monday, 13 February 2017

14 ఫిబ్రవరి 2017

వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. భాగస్వామికులతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. స్పెక్యులేషన్ చేసేవారికి మెళకువ అవసరం. చేతివృత్తులు, చిరు వ్యాపారులు, చిన్నతరహా పరిశ్రమల వారికి ఆశాజనకం. రాబడికి మించిన ఖర్చులు ఎదురయినా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది.

Sunday, 12 February 2017

13 ఫిబ్రవరి 2017

ప్రముఖుల కలయిక సంతృప్తినిస్తుంది. నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపం వల్ల బిల్డర్లకు, కాంట్రాక్టర్లకు ఇబ్బందులు తప్పవు. చేతివృత్తులు, చిన్నతరహా పరిశ్రమల వారికి ఆశాజనకం. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ధన వ్యయం చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు అధికం అవుతాయి.

Saturday, 11 February 2017

12 ఫిబ్రవరి 2017

నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది. ఖాది, చేనేత, నూలు వస్త్ర వ్యాపారులకు ఆశాజనకం. దైవ, సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. పాత మిత్రుల కలయిక కొత్త ఉత్సాహాన్నిస్తుంది. రావలసిన ధనం సకాలంలో అందుతుంది.

Friday, 10 February 2017

11 ఫిబ్రవరి 2017

నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది. ఉద్యోగస్తులు అధికారులకు కానుకలు అందించి వారిని ప్రసన్నం చేసుకుంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. తలపెట్టిన పనుల్లో కాలయాపన, శ్రమాధిక్యతలాంటి చికాకులు తప్పవు. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది.

Thursday, 9 February 2017

10 ఫిబ్రవరి 2017

బంగారు, వెండి రంగాలలోని వారికి పనివారలతో చికాకులు తప్పవు. ఉద్యోగులకు స్థిరబుద్ధి లేకపోవటంవల్ల అధికారులతో మాటపడాల్సి వస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు కలిసిరాగలదు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకు తప్పదు. భాగస్వాముల మధ్య మాట పట్టింపులు, చికాకులు తలెత్తగలవు.

Wednesday, 8 February 2017

9 ఫిబ్రవరి 2017

ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తి కానరాదు. స్నేహ బృందాలు అధికం అవుతాయి. మీ వ్యక్తిగత భావాలు బయటికి వ్యక్తం చేయకండి. రుణ ప్రయత్నం ఫలిస్తుంది.

Tuesday, 7 February 2017

8 ఫిబ్రవరి 2017

విద్యార్థుల్లో ఆందోళన తొలగిపోయి నిశ్చింతకు లోనవుతారు. ప్రేమికులకు మిత్రులద్వారా సహాయ సహకారాలు అందగలవు. రావలసిన మొండిబాకీలు సైతం వసూలు కాగలవు. మీ రాక బంధువులకు సంతోషం కలిగిస్తుంది. రావలసిన పత్రాలు, రశీదులు చేతికి అందుతాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత ముఖ్యం.

Monday, 6 February 2017

7 ఫిబ్రవరి 2017

అతిథి మర్యాదలు బాగుగా నిర్వహించటంవల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. స్థిర చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. సంఘంలో మీ స్థాయి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలలో సంతృప్తి కానవస్తుంది. దైవ దర్శనాలు చేస్తారు. ఒక కార్యం నిమిత్తం దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. కుటుంబ అవసరాలు కొంత మానసికంగా ఆలోచనలకు గురి చేస్తాయి.

Sunday, 5 February 2017

6 ఫిబ్రవరి 2017

భాగస్వామికుల మధ్య పరస్పర అవగాహన కుదురుతుంది. బంగారు, వెండి, లోహ, రత్న వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. ఆలయాలను సందర్శిస్తారు. వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ అవసరం. కూర, పండ్ల, పూల వ్యాపారస్తులకు లాభదాయకం. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది.

Saturday, 4 February 2017

5 ఫిబ్రవరి 2017

ప్రేమికులకు పెద్దలతో సమస్యలు తలెత్తగలవు. కొంతమంది మీ మాట సహాయాన్ని అర్థిస్తారు. ఆపత్సమయంలో స్నేహితులు అండగా నిలుస్తారు. బంధువుల రాకపోకలు అధికం అవుతాయి. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. భాగస్వాముల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

Friday, 3 February 2017

4 ఫిబ్రవరి 2017

ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు. సినిమా, కళా, రచన, పత్రిక రంగంలోని వారికి సంతృప్తి కానరాదు. స్త్రీలకు ఉపాధిపట్ల ఆసక్తి పెరుగుతుంది. వాణిజ్య, ఫ్యాన్సీ, మెడికల్, ఎరువులు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు శుభదాయకం. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. తోటల రంగాల వారికి ఆందోళన తప్పదు.

Thursday, 2 February 2017

3 ఫిబ్రవరి 2017

రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఒక విషయంలో మిత్రుల తీరు మీకెంతో నిరుత్సాహం కలిగిస్తుంది. విద్యార్థుల్లో ఆందోళన తొలగిపోయి నిశ్చింతత చోటు చేసుకుంటుంది. సంఘంలో గుర్తింపు గౌరవం పొందుతారు. పెద్దలతో సోదరుల విషయాలు చర్చకు వస్తాయి. ఉద్యోగస్తులకు తొందరపాటుతనంవల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

Wednesday, 1 February 2017

2 ఫిబ్రవరి 2017

పాత సమస్యలు పరిష్కారం కాకపోవటంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. మిత్రులకు హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి కనబరుస్తారు. భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చోటుచేసుకుంటాయి.