Tuesday, 31 January 2017

1 ఫిబ్రవరి 2017

నూతన పెట్టుబడులు, ఉమ్మడి వ్యాపారాలు, స్త్రీలకు అలంకరణలు, వస్త్రాలు, విలువైన వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకున్నంత సంతృప్తిగా సాగదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనులు నిర్వఘ్నంగా పూర్తి చేస్తారు.

Monday, 30 January 2017

31 జనవరి 2017

ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల్లోని వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వాహనం నడుపునప్పుడు జాగ్రత్త అవసరం. దంపతుల మధ్య అవగాహనాలోపం, చికాకులు వంటివి చోటు చేసుకుంటాయి. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, స్టేషనరీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు సామాన్యం. ఉత్తర ప్రత్యుత్తరాలు మీకెంతో సంతృప్తినిస్తాయి.

30 జనవరి 2017

చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికం అవుతుంది. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు అనుకూలం. కోర్టు, భూ వివాదాలు పరిష్కరింపబడతాయి. కంపెనీ వ్యవహారాలు, వృత్తి వ్యాపారుల గురించి సన్నిహితులతో చర్చిస్తారు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. దూర ప్రయాణాలలో మెలకువ అవసరం.

Saturday, 28 January 2017

29 జనవరి 2017

ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేస్తారు. పాత మిత్రుల కలయికతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో నాణ్యతా లోపంవల్ల నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. నూతన ఉద్యోగ యత్నాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

Friday, 27 January 2017

28 జనవరి 2017

ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారంవల్ల సమసిపోతాయి. వాహన ఛోదకులకు చికాకులు అధికం అవుతాయి. క్రీడ, కళ, సాంస్కృతిక రంగాలపట్ల ఆసక్తి వహిస్తారు. హోటల్, తినుబండారాల, క్యాటరింగ్ రంగాలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం అవుతాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. ఖర్చులు అధికం అవుతాయి.

Thursday, 26 January 2017

27 జనవరి 2017

బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి పంపకాల్లో సోదరుల మధ్య ఏకీభావం నెలకొంటుంది. దైవ, సేవా కార్యక్రమాలకు ఇతోధికంగా సహకరిస్తారు. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టులకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరపుతారు.

Wednesday, 25 January 2017

26 జనవరి 2017

స్త్రీల కళాత్మకతకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. చెల్లింపులు, షాపింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. మిత్రుల తీరు నిరుత్సాహపరుస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. ప్రముఖుల కలయిక ఉపకరిస్తుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు.

Tuesday, 24 January 2017

25 జనవరి 2017

సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ఖర్చులు అదుపుకాకపోగా, మరింత ధన వ్యయం అవుతుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృత్తులు, చిరు వ్యాపారులకు కలిసి రాగలదు. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారితో సమన్వయం లోపిస్తుంది.

24/01/2017

ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. వ్యాపారులకు పోటీ పెరగటంతో ఆశించినంత ఆర్థిక సంతృప్తి ఉండదు. హామీలు ఉండటం మంచిది కాదని గమనించండి. స్పెక్యులేషన్ చేయువారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆడిటర్లకు పనిలో ఒత్తిడి, చికాకులు ఎదురవుతాయి. ఇతరుల ఆంతరంగిక విషయాలలో జోక్యం చేసుకోకండి.